
మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ పట్టుబడిన బిల్ కలెక్టర్
ఖాళీ స్థలానికి పన్ను నిర్ణయించేందుకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆత్మకూరుకు చెందిన సజ్జాద్ అలీ అనే వ్యక్తి తన ఖాళీ స్థలానికి పన్ను నిర్ణయించాల్సిందిగా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పని పూర్తి చేయడానికి బిల్ కలెక్టర్ భాస్కర్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు.
కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలతోనే తాను ఈ నగదు అడుగుతున్నట్లు బాధితుడికి సూచించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సజ్జాద్ అలీ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
పక్కా ప్లాన్‌తో దాడి బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు పక్కా వ్యూహం రచించారు.
కార్యాలయంలో బాధితుడి నుంచి బిల్ కలెక్టర్ భాస్కర్ నగదు తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కమిషనర్ రమేష్ బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు.




