
DEECET-2026 షెడ్యూల్ విడుదల…
Web desc : 2026-28 విద్యా బ్యాచ్‌కు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (TG DEECET) షెడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పరీక్ష మే 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. తెలంగాణ అంతటా మైనారిటీ, మైనారిటీయేతర కళాశాలలతో సహా ప్రభుత్వ జిల్లా విద్య మరియు శిక్షణ సంస్థలు (DIETలు), ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరుగుతాయి.
అర్హత, రిజిస్ట్రేషన్ ఫీజు, షెడ్యూల్‌తో సహా వివరణాత్మక నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ డీసెట్-2026 పరీక్షలు జరుగుతాయి.
ఈ మేరకు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026-28 విద్యా సంవత్సరానికిగానూ కంప్యూటర్ ఆధారతి పరీక్షా పద్ధతిలో మే 21, 22 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
రాష్ట్రంలోని మైనారిటీ, నాన్-మైనారిటీ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డీఈఈసెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో 2026-28 విద్యా సంవత్సరానికి సంబంధించి.. రెండు సంవత్సరా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే..
డీసెట్ 2026 కన్వీనర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డీఈఈసెట్ చైర్పర్సన్ నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను డీఈఈసెట్-2026 కన్వీనర్‌గా నామినేట్ చేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.



