PoliticalTelangana

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేసిన ఘటన ధర్మసాగర్​మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ కు చెందిన వైష్ణవిని స్థానికుడైన మాచర్ల రాకేశ్​ప్రేమిస్తున్నానని నమ్మించి, శారీరకంగా వాడుకున్నాడు.

ఆమె గర్భం దాల్చడంతో బలానికి సంబంధించిన మాత్రలని చెప్పి, గర్భ నిరోధక మందులు ఇవ్వడంతో గర్భస్రావమైంది.

పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడగగా రాకేశ్​నిరాకరించడంతో పోలీస్​స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాకేశ్ ఠాణాలో పెద్దల సమక్షంలో మాట్లాడుకొని, వైష్ణవిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

గతేడాది ఎంగేజ్​మెంట్​కూడా జరిగింది. తర్వాత తాను పెళ్లి చేసుకోనని మొండికేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారు రాకేశ్​పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.

బెయిల్ పై బయటకు వచ్చిన రాకేశ్​వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని వైష్ణవి ఆరోపించింది. గురువారం అతని ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. రాకేశ్​తో తనకు వివాహం జరిపించి, న్యాయం చేయాలని కోరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button