ManchiryalaPoliticalTelangana

బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత

బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత

బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

వసతిగృహంలో ఫిబ్రవరి 6న రాత్రి వండిన మిల్ మేకర్ కూర తిన్న విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకొని స్పృహ కోల్పోయారు.

ఫుడ్ తిన్న వెంటనే వార్డెన్ కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాలికలు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిలను తమ సొంత వాహనాలలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

కొంతమంది విద్యార్థినిల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు. పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు జరిగిన పరిస్థితి పై వివరాలు ఆరాదీశాయి విద్యార్థి సంఘాలు.

ఫుడ్ పాయిజన్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని విద్యార్థినులకు ఆర్ఏంపీ వైద్యుడితో చికిత్స చేయించిన హాస్టల్ వార్డెన్

108కి కాల్ చేయమని విద్యార్థినులు వేడుకున్నా.. కనికరించకుండా అలాగే చూస్తూ కూర్చున్న హాస్టల్ సిబ్బంది

అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా పడేయకుండా అలానే తినాలని విద్యార్థినులపై కర్కశత్వం

బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విస్తుగొలిపే విషయాలు

అన్నంలో పురుగులొచ్చి 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

తీవ్ర వాంతులు చేసుకొని, కళ్ళు తిరిగి, ఎక్కడికక్కడే కుప్పకూలిన విద్యార్థినులు

విషయం బయటకు తెలిపిస్తే పరువు పోతుందని అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆర్ఏంపీ వైద్యుడితో ఇంజక్షన్, టాబ్లెట్ ఇప్పించిన వార్డెన్

సాయంత్రం 7:30 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఫోన్ చేసి తెలపగా, రాత్రి 10 గంటలకు హాస్టల్ వద్దకు వెళ్ళిన వార్డెన్

ఆ మూడు గంటలు నరకం అనుభవించామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థినులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button