
కొండపల్లి సరిత విజయం….ఇల్లందు అభివృద్ధికి చక్కని అవకాశం
ఇల్లందు పట్టణంలో ఎంతో చరిత్ర కలిగిన 23 వ వార్డు అభివృద్ధికి ఈ మున్సిపల్ ఎన్నికలు అవకాశం గా మారనున్నాయి.
విద్యావంతురాలు గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పనిచేసిన కొండపల్లి సరిత 23వ వార్డు నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న నేపథ్యంలో వార్డు ప్రజల్లోనూ అభివృద్ధి ఆశలు చిగురిస్తున్నాయి.
స్థానికంగా నెలకొన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన సరిత విజయం 23వ వార్డు అభివృద్ధికి బాటలు వేయనుంది. ఈసారి ఎన్నికల్లో ఇల్లందులోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా 23వ వార్డు ప్రజల తీర్పు చారిత్రాత్మకం కానుంది.
యువత మహిళలు మేధావుల్లో సైతం రాజకీయాలకు అతీతంగా వార్డు అభివృద్ధి ధ్యేయం కోసం మేమున్నాం అండగా అంటూ.. కొండపల్లి సరితకు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు.




