KhammamPoliticalTelangana

పదేళ్ల దోపిడీకా? అభివృద్ధి, సంక్షేమానికా? ఆలోచించి ఓటు వేయండి

పదేళ్ల దోపిడీకా? అభివృద్ధి, సంక్షేమానికా? ఆలోచించి ఓటు వేయండి

పదేళ్ల దోపిడీకా? అభివృద్ధి, సంక్షేమానికా? ఆలోచించి ఓటు వేయండి

వైరా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రతి పైసా పేదల కోసమే ఖర్చు చేస్తాం.

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. భారీ ర్యాలీ అనంతరం నిర్వహించిన ఈ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, పేదల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు, ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచినందుకు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలా? వారి పరిపాలన ముగిసిపోయింది, వారి పాలన చాలని ప్రజలు విసిగి చెంది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు లేదా ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.

మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం, ఒక్కో ఇంటికి 5 లక్షలు అందిస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా చేస్తాం.
పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తాం.

బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసం తిరిగి తిరిగి పేదలు అలసిపోయారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేశాం. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాల్లో 1.02 కోట్లకు ఉచిత సన్న బియ్యం 6 కిలోల చొప్పున అందిస్తున్నాం.

వృద్ధులు, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితి నుంచి బయటపడేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.

మహిళల సాధికారత ప్రజా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత.మహాలక్ష్మి పథకం కింద ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని ప్రకటించాం,

మొదటి సంవత్సరంలోనే 27 వేల కోట్లు అందించాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నాం.

బీఆర్ఎస్ 10 ఏళ్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో గ్రూప్-1, 2, 3 పరీక్షలు విజయవంతంగా, పారదర్శకంగా నిర్వహించి, ప్రజల సమక్షంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం , ఇప్పటి వరకు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఓటు అడుగుతున్నారు, పట్టణ ప్రజలంతా వారికి ఎందుకు ఓటు వేయాలో ప్రశ్నించాలి.

ప్రజల బాధలు అర్థం చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు నిజమైన సంక్షేమం అందిస్తుంది. ప్రజా ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని చూసి , ఆ అభివృద్ది ప్రయాణం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి.

“ప్రతి పైసా పోగు చేస్తాం — పేదలకు పంచుతాం. పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం”. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button