
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. భార్య మృతి.. లభించని భర్త ఆచూకి..!
Web desc : అనుమానాస్పద రీతిలో శనివారం సాయంత్రం సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారును రెస్క్యూ టీం పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఆదివారం బయటకు తీశారు.
ప్రమాద సమయంలో భార్యభర్త ఉండగా, కారు బయటకు తీశాక భార్య పద్మ మృతదేహం మాత్రమే లభ్యమైంది. దీంతో ఇప్పటికే అనుమానాస్పద ప్రమాదంగా వార్త ప్రచారంలో ఉండగా, కారు బయటకు తీశాక ఈ కేసు పోలీసులకు తలనొప్పింగా మారింది.
త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య(63), పద్మ (60), దంపతులు కిరాణా దుకాణం నడిపిస్తూ జీవనం క కొనసాగిస్తు్నారు.
గత నెలలో వీరు బైక్ వెళుతుండగా, ఓ కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలో హైదరాబాద్ లో చికిత్స పొంది, మిర్యాలగూడలో ఉండే కుమారుడి దగ్గరకు రెండు రోజుల క్రితమే వచ్చారు. శనివారం సాయంత్రం స్వగ్రామానికి బయలు దేరారు.
ముకుందాపురం గ్రామానికి రాగానే, అనుమానస్పదరీతిలో సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. కొన్ని గంటలుగా రెస్క్యూ టీం కష్టపడగా ఎట్టకేలకు క్రెయిన్ సహాయంతో కారును బయటకు తీయగా, అందులో పద్మ మృతదేహం లభించింది.
పుల్లయ్య ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అతుడు నీటి ఉదృతికి కొట్టుకుపోయాడా.. అసలు కారులో ఉన్నాడా..? లేదంటే కారులో ఏదైనా ఘర్షణ వాతావరణం జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
నిజంగా ప్రమాదమేనా..? సాగర్ రోడ్డులో ముకుందాపురం గ్రామం నుంచి కంపసాగర్ వెళ్లే దారిలో బ్యాంక్ ఎదుట స్పీడ్ బ్రేకర్లు, మరో 100 మీటర్ల దూరంలో మరో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది.
అక్కడినుంచి ప్రమాద స్థలి కేవలం 60 మీటర్లు ఉంటుంది. బ్రేకర్లు దాటాక కారు అదుపు తప్పేందుకు అవకాశం ఉండదని, పక్కా ప్రణాలిక ప్రకారమే, డ్రైవర్ కారును కాల్వలో పడేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాధితులకు సంభందించిన ఓ వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బు కోసమే.. కావాలనే ప్రమాదంగా చిత్రీకరిస్తూ హతమార్చారనే మరి కొంతమంది నుంచి సృష్టించిన రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.



