KhammamPoliticalTelangana

ఖమ్మం జిల్లాలో రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత..

ఖమ్మం జిల్లాలో రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత..

.ఖమ్మం జిల్లాలో రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసుల్లోని 953 కేజీల గంజాయిని కాల్చివేతకు ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు స్టేషన్లలో కేసుల వారిగా గంజాయిని ఒక దగ్గరకు చేర్చి మొత్తంగా 953 కేజీల గంజాయిని ప్రభుత్వ అమోదిత ఏడబ్ల్యూఎం కన్సంటింగ్ లిమిటేడ్ కాల్చివేత పరిశ్రమలో సోమవారం కాల్చివేశారు.

ఈ కంపెనీతల్లేడ మండలం గోపాల్‌పేట్‌లో ఉంది. కాల్చివేసిన గంజాయి విలువ రూ. 4.76 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం 1 ఎక్సైజ్ స్టేషన్‌లో 9 కేసుల్లో 42 కేజీలు, ఖమ్మం `2 స్టేషన్‌లో5 కేసుల్లో 57 కేజీల, మధిర స్టేషన్‌లోని 7 కేసుల్లో 193 కేజీల, కొత్తగూడం జిల్లాలోని పాల్వంచ స్టేషన్‌లో 2 కేసుల్లో 114 కేజీలు, మణుగూర్ స్టేషన్‌లో ఒక కేసులో 21 కేజీలు, భద్రాచలం స్టేషన్‌లో 23 కేసుల్లో 625 కేజీల గంజాయిని కాల్చి వేసినట్లు డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button