
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి
షాద్ నగర్ జోన్ డిసిపి శిరీష కు బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
సి కే న్యూస్ షాద్ నగర్:ఫిబ్రవరి 10
స్థానిక సంస్థల ఎన్నికల ముగింపు దశలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.శంకరయ్య షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్యలక్ష్మి, పద్మజ, విజయమ్మ షాద్ నగర్ డిసిపి శిరీష కు ఫిర్యాదు చేశారు
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై బహిరంగ సభలో వ్యక్తిగతంగా అవమానించడం అనుచిత పదజాలంతో దూషించడం ప్రజల్లో ద్వేషాని రెచ్చగొట్టడం శాంతి భద్రతలకు భంగ కలిగించే విధంగా మాట్లాడాడని ప్రజాప్రతినిధిగా ఉండి చట్టాన్ని రాజ్యాంగాన్ని ఎన్నికల నియమా నిబంధనలను గౌరవించాల్సిన ఎమ్మెల్యేని మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ను ఉల్లంఘిస్తూ ప్రసంగించారని దీనిపై అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారి వెంట జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, కేశంపేట మాజీ వైస్ ఎంపీపీ సురేందర్ తదితరులు ఉన్నారు.



