HyderabadPoliticalTelangana

వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

కట్టుకున్న భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హుస్సెన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ నగరంలో వెలుగుచూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది హుస్సెన్‌సగార్‌ నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురానికి చెందిన సీతారాం అనే వ్యక్తికి నంద్యాలకు చెందిన యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగా రిత్యా హైదరాబాద్‌ వచ్చిన ఈ దంపతులు గత కొంతకాలంగా బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు.

సీతారాం ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దంపతులకు పిల్లలు కూడా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

దీంతో గత జనవరి 24న భార్య పిల్లలను వదిలి వెళ్లిపోయింది. ఇదే విషయంపై సీతారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు.

విషయం తెలుసుకున్న సీతారం అత్తామమలు ఇటీవలే పిల్లలను కూడా నంద్యాలకు తీసుకెళ్లారు. అటు భార్య, ఇటు పిల్లలను తనను వదిలి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

తన చావుకు భార్య, అత్తమామలే కారణమని వాట్సాప్ స్టేటస్‌ పెట్టిన హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది మృతదేమాన్ని వెలికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button