PoliticalSanga reddyTelangana

పోలీసులు Vs జగ్గారెడ్డి...మున్సిపల్ ఎన్నికల్లో రచ్చ రచ్చ..

పోలీసులు Vs జగ్గారెడ్డి...మున్సిపల్ ఎన్నికల్లో రచ్చ రచ్చ..

పోలీసులు Vs జగ్గారెడ్డి…మున్సిపల్ ఎన్నికల్లో రచ్చ రచ్చ..

సంగారెడ్డి : ఎన్నికలు ఎప్పుడు జరిగినా అదో కోలాహలం. పార్టీల్లో రాజకీయ నేతలు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు.. అందరూ కలిసి.. గెలుపే లక్ష్యంగా జోరు ప్రచారం సాగిస్తే.. తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు ముందుకొస్తారు. వారు వేసే ప్రతీ ఓటూ.. ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది. ఇవాళ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పండుగ అని అనుకోవచ్చు.

పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు కూడా ఇచ్చింది కాబట్టి.. భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ సాగుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.

14 వార్డులు ఏకగ్రీవం కాగా.. ఒక వార్డుకు ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వారి భవిష్యత్తును తేల్చేందుకు 52.43 లక్షల మంది ఓటర్లు రెడీ అయ్యారు. వారికోసం 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి.

ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది అత్యంత ఆసక్తికరం. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది.

అందువల్ల ఆ పార్టీకి ఇంకో మూడేళ్లు ఉన్నా.. చివరి ఏడాది ఎన్నికల ఏడాదిలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ ఎన్నికల్లో వచ్చే తీర్పు అనుకూలంగా ఉంటే.. ఆ పార్టీ.. నెక్ట్స్ 3 ఏళ్ల పాలనలో కొంత రిలాక్స్‌గా ఉంటుంది.

లేదంటే.. టెన్షన్ తప్పదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు తిప్పుకొని.. నెక్ట్స్ ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేస్తోంది. అందుకు మున్సిపల్ ఎన్నికల ద్వారా.. ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలి అనుకుంటోంది.

అనూహ్యంగా బీజేపీ.. జోరు పెంచేలా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సైలెంటుగా ఉన్న బీజేపీ.. నిన్న ఒక్కసారిగా జోరు పెంచింది. ఐతే.. ఇన్నాళ్లూ సైలెంటుగా ఉండటం ఆ పార్టీకి కొంత మైనస్ లాగా కనిపిస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదే అని ఆ పార్టీ దీమాగా ఉంది. మరి ఓటర్ల తీర్పు ఎటు అనేది ఆసక్తికరం. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

అలాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ముక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికను వాయిదా వేశారు.

ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించే ప్లాన్ ఉంది. ఐతే.. బ్యాలెట్ బాక్సుల కారణంగా.. ఫలితం రావడానికి కొంత టైమ్ పట్టవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button