
DRDOలో 25 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం ఇదే..
లడఖ్ ప్రాంతంలో పనిచేసే ప్రముఖ రీసెర్చ్ సంస్థ. అధిక ఎత్తైన ప్రాంతాల్లో వ్యవసాయం, జీవశాస్త్రం, పర్యావరణం వంటి అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. DRDO ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో పని చేయడం ప్రతిష్టాత్మకం.
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్
ఖాళీలు: 25
విద్య: పోస్టును బట్టి బీఈ / బీటెక్, ఎంఈ / ఎంటెక్, GATE అర్హత (అవసరమైతే)
సంబంధిత విభాగంలో పని అనుభవం
వయసు:
కనీసం: 28 ఏళ్లు
గరిష్టం: 35 ఏళ్లు
ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
విద్యార్హతలు, గేట్ స్కోర్, అనుభవం, పరిక్షధనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24, 2026
JRF పోస్టులకు నెలకు రూ.37,000 స్టైపెండ్
RA పోస్టులకు నెలకు రూ.67,000 వేతనం
ఇతర అలవెన్సులు సంస్థ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
అధికారిక వెబ్సైట్: https://www.drdo.gov.in



