HyderabadPoliticalTelangana

పొలం అమ్మనందుకు తండ్రి చంపిన తనయుడు.

పొలం అమ్మనందుకు తండ్రి చంపిన తనయుడు.

పొలం అమ్మనందుకు తండ్రి చంపిన తనయుడు.

అరెస్టు చేసి రిమాండ్ పంపిన పోలీసులు

వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ విజయ్ కుమార్.

సి కే న్యూస్ షాద్ నగర్ ఫిబ్రవరి 12

మద్యం తాగించి,తండ్రిని నీటి గుంతలలో పడదోసిన కొడుకు హత్య సంఘటన ఫరూక్ నగర్ మండలంలో చోటుచేసుకున్నది.మృతుని భార్య మెగావత్ సోనీ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఫరూక్ నగర్ మండలం దేవునిబండ తండాకు చెందిన మెగావత్ బాలు(43),మెగావత్ సోనీలకు ఒక కూతురు,కుమారుడు మోహన్(19)వయస్సు గుండు ఉన్నారు.ఎవరి పనులు చేసుకుంటూ వారు హాయిగా జీవిస్తూన్నారు…

హత్యకు దారి తీసిన కారణాలు.

తండ్రి పేరుమీద ఉన్న 5 గుంటల భూమిని చెల్లెలు పెళ్లి కోసం అమ్మాలని తనయుడు తండ్రిని అడగగా,అందుకు తండ్రి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గతంలో గొడవలు జరిగాయని పిర్యాదులో తెలిపారు.

చిక్కాడు ఇలా…

అయితే ఎవరైనా హంతకుడు గానీ దొంగ గానీ ఎక్కడో ఏదో చిన్న పొరపాటు లేక తప్పు చేసి దొరికిపోతారు.ఇక్కడ కూడా అదే జరిగింది.మృతుని భార్య మెగావత్ సోనీ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా హంతకుడు(మోహన్),గురువారం ఉదయం సుమారు 9:30 సమయంలో పోలీసులను చూసి ఆటోలో పారిపోతుండగా కేశంపేట రోడ్డు,యాదాద్రి హోటల్ సమీపంలో పోలీసులు నిందితున్ని పట్టుకుని విచారించగా,హంతకుడు(మోహన్)కొడుకు,హతుడు(మెగావత్ బాలు)తండ్రి పొలం అమ్మడానికి అడ్డు పడుతున్నాడని తెలుసుకుని ఎలాగైనా చంపాలని అనుకుని,గత ఆదివారం రాత్రి తండ్రిని,తనయుడు ఆటోలో షాద్‌నగర్‌లో తీసుకెళ్లి బాగా మద్యం తాగించి,అనంతరం నేరెళ్ల చెరువు గ్రామ శివారులోని చెరువు గుంతలో తోసివేసి తానే హత్యకు పాల్పడినట్లు తనయుడు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

అభినందించిన డీసీపీ శ్రీమతి సిహెచ్ శిరీష,ఏసీపీ ఎస్.లక్ష్మీనారాయణ.

ఈ కేసు విచారణ షాద్‌నగర్ డీసీపీ శ్రీమతి సిహెచ్ శిరీష,ఏసీపీ ఎస్ లక్ష్మీనారాయణ,కే.విజయ్ కుమార్ ల పర్యవేక్షణలో జరిగిందన్నారు.విచారణాధికారి ఎస్.వెంకటేశ్వర్లు,శ్రీమతి సుశీల,హెడ్ కానిస్టేబుళ్లు/పీసీలు బాల్‌రాజు,మోహన్, రాజేష్, జోత్స్న, నరేందర్ ల కీలక పాత్ర పోషించారన్నారు.వారికి పై అధికారుల ద్వారా రివార్డులు అందజేయనున్నారు.ఈ సందర్బంగా డీసీపీ శ్రీమతి సిహెచ్ శిరీష,ఏసీపీ ఎస్.లక్ష్మీనారాయణ అభినందించారు.

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు.

ఒక ఆటో రిజిస్ట్రేషన్ నం.టిఎస్.06 యూ డి 911,
వన్‌ప్లస్ మొబైల్ ఫోన్,…కాగా,పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button