NotificationPoliticalTelangana

GPO పోస్టులకు సర్వీస్ రూల్స్ ఖరారు.. అధికారిక ఉత్తర్వులు విడుదల

GPO పోస్టులకు సర్వీస్ రూల్స్ ఖరారు.. అధికారిక ఉత్తర్వులు విడుదల

GPO పోస్టులకు సర్వీస్ రూల్స్ ఖరారు.. అధికారిక ఉత్తర్వులు విడుదల

తెలంగాణ రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో పాలనను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రామ పాలన అధికారి (GPO) సబార్డినేట్ సర్వీస్ రూల్స్-2025 పేరుతో కొత్త నిబంధనలను ఖరారు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పరిపాలనను పటిష్టం చేసేందుకు 10,954 గ్రామ పాలన అధికారి (GPO) పోస్టులను ప్రభుత్వం కేటాయించింది.

గతంలో పనిచేసిన వీఆర్వోలు (VROs), జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లలో క్రమబద్ధీకరించబడిన వీఆర్ఏలను (VRAs) ఈ పోస్టుల్లో నియమించనున్నారు. వీటితో పాటు నేరుగా నియామకం ద్వారా కూడా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హతలు, వయో పరిమితి.. జీపీవో పోస్టులకు గాను నేరుగా నియామకమయ్యే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

బదిలీ ద్వారా వచ్చే మాజీ వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థులు డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌తో పాటు కనీసం ఐదేళ్ల సర్వీసు కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 34 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు.

అయితే, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుందని సర్వీస్‌ రూల్స్‌లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు విధులకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

నేరుగా నియామకమైన వారు విధుల్లో చేరిన రెండేళ్ల లోపు నిర్దేశిత పరీక్షలైన పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ GPO, విలేజ్ మాన్యువల్ అఫ్ అకౌంట్స్, సర్వే ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత కనీసం మూడేళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు అందిస్తామని బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.

పదోన్నతులు, ఇతర వివరాలు GPO కేడర్‌లో పనిచేస్తున్న వారికి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందే అవకాశం కల్పించారు. ఇందుకోసం 60:40 నిష్పత్తిని అమలు చేయనున్నారు. ఈ పోస్టులకు జిల్లా కలెక్టర్ నియామక, క్రమశిక్షణా అధికారిగా వ్యవహరిస్తారు.

జిల్లాను ఓ యూనిట్‌గా పరిగణించి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ నిబంధనల అమలుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)ను ప్రభుత్వం ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button