Mahabub badPoliticalTelangana

మద్యం విక్రయాలపై లేని కోడ్ సేవాలాల్ జయంతి పై ఎందుకు?

మద్యం విక్రయాలపై లేని కోడ్ సేవాలాల్ జయంతి పై ఎందుకు?

సేవాలాల్ జయంతిపై ఆంక్షలు, గిరిజన హృదయాలను గాయపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం — శంకర్ నాయక్ నిప్పులు

మహబూబాబాద్ లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు….

హాజరైనా కుల సంఘాల నాయకులు ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్

మహబూబాబాద్: గిరిజన ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సింది పోయి, పోలీసు బలగాలతో భయానక వాతావరణం సృష్టించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

గత పదేళ్ల బిఆర్ఎస్ స్వేచ్ఛ Vs నేటి కాంగ్రెస్ నిర్బంధం

శంకర్ నాయక్ మాట్లాడుతూ, గత పదేళ్ల కాలంలో (బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో) సేవాలాల్ జయంతి వేడుకలు ఎంతో ప్రశాంతంగా, పండగ వాతావరణంలో జరిగాయని గుర్తు చేశారు.

“గత పదేళ్లలో ఒక్క పోలీసు కానిస్టేబుల్ అవసరం లేకుండానే వేలాది మంది లంబాడీ భక్తులు క్రమశిక్షణతో వేడుకలు జరుపుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.”

“కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది మంది పోలీసులను దింపి, భక్తులను నేరస్తుల్లా చూస్తోంది. గిరిజన ఆలయాలను పోలీస్ క్యాంపులుగా మార్చడం దారుణం.”

భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న — కాంగ్రెస్ సర్కార్

గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని శంకర్ నాయక్ మండిపడ్డారు. భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగను పోలీసుల పహారాలో జరుపుకోవాల్సి రావడం గిరిజన జాతికే అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అణచివేత ధోరణిని గిరిజన ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఎన్నికల కోడ్ సాకుపై LHPS రాష్ట్ర అధ్యక్షులు భీమా నాయక్ ఆగ్రహం

ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగట్టారు

దేవుడికి కోడ్ వర్తిస్తుందా……?

“ఎన్నికల కోడ్ పేరుతో సేవాలాల్ జయంతి వేడుకలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. రాజకీయ నాయకులకు, ప్రచారాలకు కోడ్ ఉండాలి కానీ, దైవ కార్యాలకు, శతాబ్దాల నాటి సంప్రదాయాలకు కోడ్ ఎలా వర్తిస్తుంది?” అని ప్రశ్నించారు.

మద్యం విక్రయాలపై లేని కోడ్ సేవాలాల్ జయంతి పై ఎందుకు?:

రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపులు, మద్యం విక్రయాలు ఎక్కడా ఆగకుండా విచ్చలవిడిగా సాగుతున్నాయని, అక్కడ లేని నిబంధనలు గిరిజన పండుగ దగ్గరే ఎందుకు అమలవుతున్నాయని నిలదీశారు.

ప్రభుత్వం కావాలనే గిరిజన వేడుకలపై వివక్ష చూపుతోందని, పోలీసులను మోహరించి భక్తులను భయభ్రాంతులకు గురిచేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

గిరిజన లంబాడీల ఆగ్రహం – ప్రభుత్వానికి హెచ్చరిక

సేవాలాల్ మహారాజ్ జయంతి అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది గిరిజన జీవన విధానంలో ఒక భాగం.

అటువంటి పవిత్ర కార్యానికి ఆటంకాలు కలిగిస్తూ, భక్తులను ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి పునాది అని గిరిజన నాయకులు హెచ్చరిస్తున్నారు. గిరిజన మనోభావాలతో ఆడుకుంటే సహించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు…

లూనావత్ అశోక్ నాయక్ బానోతు వెంకన్న బానోతు దాము బానోతు రాందాస్ నాయక్ గుగులోతు రామచంద్రనాయక్ సాంబశివుడు ఇస్లావత్ సుమన్ నాయక్ సంతోష్ నాయక్ బాలు నాయక్ ఆంగోత్ కిషన్ నాయక్ రవి నాయక్ నవీన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button