
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డ వ్యక్తి
Web desc : ఆంధ్రప్రదేశ్ లోని, చిత్తూరు కలెక్టరేట్ వద్ద చోటుచేసుకున్న సంఘటన కలకలం రేపింది.
భూ వివాదాలపై అధికారుల స్పందన లేకపోవడంపై తీవ్ర నిరాశకు లోనైన ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కోర్టు ఉత్తర్వులు ఉన్నా తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సాయికుమార్ ఈ చర్యకు పాల్పడ్డాడు.
అధికారుల తీరుపై విరక్తి చెంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు.




