
మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి…
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు చెప్పారు.
దీంతో గెలిచిన అభ్యర్థులంతా సమావేశ మందిరంలో ఉండగా.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు.
కార్యాలయం వెనుక వైపు నుంచి రాళ్లు విసిరారు. దీంతో కార్యాలయం కిటికీ ధ్వంసం అయింది. పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనతో ఎన్నిక పై సందిగ్ధత నెలకొంది.



