EducationHealthKhammamPoliticalTelangana

విద్యార్థిపై వార్డెన్ ల దాష్టీకం… ముగ్గురిపై కేసు నమోదు

విద్యార్థిపై వార్డెన్ ల దాష్టీకం… ముగ్గురిపై కేసు నమోదు

విద్యార్థిపై వార్డెన్ ల దాష్టీకం… ముగ్గురిపై కేసు నమోదు

Web desc : ఖమ్మం : ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురు వార్డెన్లపై ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.

ఖమ్మం నగరానికి చెందిన భార్గవ్ 6వ తరగతి విడివోస్ కాలనీ లోని రెసోనెన్స్ స్కూల్ లో చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం విద్యార్థినీ స్కూల్ వార్డెన్ విచక్షణారహితంగా కొట్టాడు. విద్యార్థి రాత్రి కొంత నొప్పితో బాధగా ఉండటంతో తల్లిదండ్రులకు చెప్పాడు.

వీపు మీద దెబ్బలు కనిపించడంతో వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉదయం విద్యార్థితో బంధువులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీపు మొత్తం కందిపోయింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా ఎందుకు కొట్టారు అంటూ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. స్కూల్ ఎదుట నిరసన కార్యక్రమం జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఇన్స్పెక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం… మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లికి చెందిన ఓ విద్యార్థి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

వసతిగృహంలోనే ఉంటున్న ఆ విద్యార్థిని ఈ నెల 12న రాత్రి సమయంలో వార్డెన్లు రాకేశ్, కిరణ్, శివలు వేరే గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారు.

చేతులు, కర్రలతో విపరీతంగా కొట్టడంతో అతని వీపంతా వాతలు తేలాయి. విషయం ఎవరికీ చెప్పకుండా కట్టడి చేయడంతో బాలుడు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేకపోయాడు.

బాధితుడి స్నేహితుడి ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు.. శనివారం పాఠశాలకు వచ్చి వార్డెన్లు, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న తల్లిదండ్రులు.. శనివారం పాఠశాలకు వచ్చి వార్డెన్లు, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు వార్డెన్లు రాకేశ్, కిరణ్, శివలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button