
హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య…
Web desc : హైదరాబాద్‌లోని షేక్‌పేట నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ సంధ్యారాణి (20) అనే మూడో సంవత్సరం విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.
ఆదివారం ఉదయం తన స్నేహితురాళ్లతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం సంధ్యారాణి తన గదిలోకి వెళ్ళింది. సెలవు దినం కావడంతో మిగిలిన వారంతా నిద్రపోతుండగా, ఆమె హాస్టల్ గదిలో షవర్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
పోలీసుల దర్యాప్తు . చాలా సేపటి వరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపు తట్టారు.
లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో వెంటనే హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



