
ట్రాక్టర్ ట్రక్కులను దొంగలించిన వారిని పట్టుకున్న పోలీసులు….
ఎస్ ఐ వీరేందర్ నీ మరియు సిబ్బందిని అభినందించిన వైరా సిఐ వైవీ ప్రసాద్, వైరా ఎ సి పి సారంగపాణి.
సి.కె న్యూస్, చింతకాని ప్రతినిధి
చింతకాని మండలంలో గత ఏడాది ఆగస్టు నెలలో ప్రొద్దుటూరు గ్రామంలో ఇంటిముందు రోడ్డుఫై పెట్టిన రెండు ట్రాక్టర్ ట్రక్కులను, కొనిజెర్ల మండలం,పెద్ద మునగాల గ్రామానికి చెందిన మరొక ట్రాక్టర్ ట్రక్కును మొత్తం మూడు ట్రాక్టర్ ట్రక్కులను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని చింతకాని,కొనిజెర్ల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయినట్లు చింతకాని ఎస్సై వీరేందర్ తెలిపారు.
కేసు విచారణ జరిపిన పోలీసులకు అంధ్రప్రదేశ్ రాష్ట్రం NTR జిల్లా వత్సవాయి మండలం, దబ్బాకుపల్లి గ్రామానికి చెందిన చింతల నరేంద్ర గా మరియు అదే గ్రామానికి చెందిన మువ్వల ఉదయ్ కిరణ్ గా గుర్తించామని తెలిపారు.
గతంలో చింతల నరేంద్ర అనే నిండుతుడి నుండి ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్ ట్రక్కులను పోలీసు రికవరీ చేసినట్లు తెలిపారు. కొనిజెర్ల మండలం,పెద్ద మునగాల గ్రామానికి చెందిన మరొక ట్రాక్టర్ ట్రక్కును మువ్వల ఉదయ్ కిరణ్ ఉదయం నామవరం క్రాస్ రోడ్డు నందు వాహనాల తనిఖీలలో పోలీసుకి దొరికగా ట్రక్కును రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్ నిమిత్తం ఖమ్మం కోర్టు కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇట్టి మూడు ట్రక్కుల విలువ 690000/- ఉంటుందని అన్నారు. ట్రాక్టర్ ట్రక్కుల దొంగలను పట్టుకొని రికవరి చేసిన SI వీరేందర్ ని మరియు సిబ్బందిని వైరా CI YV ప్రసాద్, వైరా ACP S.సారంగపాణి అభినందించారు.



