
సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు సేవించి ఆత్మ*హత్యాయత్నo…
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 17,
బూర్గంపాడు మండలం, సారపాక మేడే కాలనీలో నివసిస్తున్న లాకవత్ వెంకన్న ఆత్మ*హత్యాయత్నాని కి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
గతంలో సారపాకలో ఆటో నడుపుతూ జీవనం సాగించిన వెంకన్న, ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లి కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ మధ్య తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై నిలదీయడంతో తనపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తీవ్ర మనస్తాపానికి గురైన వెంకన్న సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు సేవించినట్లు సమాచారం. అతడిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



