
హత్యాయత్నం కేసు లో నిందితుల అరెస్టు… బూర్గంపాడు ఎస్సై
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఫిబ్రవరి 17,
సోమవారం గన్నవరం గ్రామం ఎటపాక మండలానికి చెందిన ములిశెట్టు రమా భర్త శ్రీనివాస్ రావ్ తన అల్లుడు కట్టా యశ్వంత్, 23 సం, అనే అతనూ తేదీ 14.02.2026 న రాత్రి బూర్గంపాడు మండలం మోతే వద్ద ఆక్సిడెంట్ అయ్యి భద్రాచలం ఆసుపత్రిలో ఉన్నాడని మాకు తెలిసి, మేము హాస్పిటల్ కి వెళ్లి చూడగా తలకు దెబ్బలు తగిలి ఉన్నాయి.
అట్టి యాక్సిడెంట్ వల్ల అయిన గాయాలు కావని మరియు గన్నవరం కు చెందిన కట్ట సాయి దీపక్ మరియు భద్రాచలం కు చెందిన భాను ప్రకాష్ అనే వ్యక్తులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్యాయత్నం చేసినట్టు అనుమానం ఉందని దరఖాస్తు ఇచ్చారు. ఈ దరఖాస్తుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము.
మంగళవారం కట్టా సాయి దీపక్ మరియు భాను ప్రకాష్ లు కారులో వెళ్తుంటే సారపాక వద్ద అరెస్టు చేశారు. కట్టా సాయి దీపక్ మరియు భాను ప్రకాష్ లు ఇద్దరు స్నేహితులు.
భాను ప్రకాష్ ప్రముఖ బ్యాంకులో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తాడు. గత సంవత్సరం నవంబర్ నెలలో కట్ట యశ్వంత్ అనే వ్యక్తి పేరు మీద వీళ్ళిద్దరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని, దానికి నామినేగా కట్టా సాయి దీపక్ ఉన్నాడు.
వాళ్ల పథకం ప్రకారం తేదీ 14.02.2026 నా రాత్రి కట్టా యశ్వంత్ ని మోతే దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ అతనికి బాగా మద్యం సేవించి, తిరిగి అతను స్కూటీ మీద ఎక్కేటప్పుడు వెనుక నుంచి రాడ్డుతో దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు.
అతడు చనిపోతే దాన్ని రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరించి తద్వారా సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవచ్చని ఈ నేరం చేశామని ఒప్పుకున్నారు.



