NotificationPoliticalTelangana

కానిస్టేబుల్ (GD) పరీక్ష వాయిదా...

కానిస్టేబుల్ (GD) పరీక్ష వాయిదా...

కానిస్టేబుల్ (GD) పరీక్ష వాయిదా…

Web desc : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CAPFs, SSF మరియు అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25,487 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసింది.

ఈ పరీక్ష ఫిబ్రవరి 23న జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది.

పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. అభ్యర్థులు అప్డేట్స్ కోసం SSC అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలని సూచించింది.

అలాగే పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు పరీక్షకు 8-10 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

అడ్మిట్ కార్డులు పరీక్షకు 2-3 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకునేలా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక సమాచారం కోసం SSC వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ సూచించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button