
క్రికెట్ గ్రౌండ్లో వ్యక్తి దా*రుణ హత్య…
మొయినాబాద్ మున్సిపల్పరిధిలోని కాశీం బౌలిలో ఓ వ్యక్తి దా*రుణ హత్యకు గురయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బోనగిరి ఈశ్వర్ (34) బతుకుదెరువు కోసం మొయినాబాద్ పరిధిలోని సురంగల్ వచ్చి ఓ అద్దె ఇంట్లో భార్య , ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
ఎన్కెపల్లి గ్రామానికి చెందిన ముదిగొండ సురేశ్ వద్ద హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం కాశీంబౌలిలోని రెయిన్బో క్రికెట్ గ్రౌండ్లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేశారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.



