PoliticalTelangana

వేలు ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు.. మంత్రి కొండా సురేఖ

వేలు ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు.. మంత్రి కొండా సురేఖ

వేలు ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు.. మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొని మాట్లాడారు. ‘తాము రాజకీయ నేతలం.. రాజకీయాల్లో వేలు ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కాలేరు.

ఎంత కష్టపడి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయినా చివరికి మేం చెప్పింది వినాల్సివస్తుంది’ అని కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పది సంవత్సరాల్లో ఎఫ్‌సీఆర్‌ఐ తెలంగాణ హరితాభివృద్ధికి కీలక వేదికగా ఎదిగిందని తెలిపారు.

అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో సంస్థ ముందంజలో ఉందన్నారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని ప్రశంసించారు.

ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ, సీనియర్ ఫ్యాకల్టీ నియామకం, మౌలిక వసతుల బలోపేతంపై ప్రతిపాదనలు పంపాలని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని, ఫారెస్ట్రీలో ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button