HealthPoliticalTelangana

కల్తీ కోవా తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి...

కల్తీ కోవా తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి...

కల్తీ కోవా తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి…

తాండూరులో కల్తీ కోవా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS హెచ్చరించారు.

తాండూరులో జరిగిన కల్తీ కోవా దాడుల వివరాలను ఆమె వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇన్స్‌పెక్టర్ మహ్మద్ అన్వర్ పాషా నాయకత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందం తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో సుమారు 120 కిలోల కల్తీ కోవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రకాష్ విష్ణు (రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి)
మహ్మద్ సల్మాన్ (చాంద్రాయణగుట్ట, హైదరాబాద్ నివాసి) స్వాధీనం చేసుకున్న కల్తీ కోవాతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తాండూరు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

కోవా బన్ లో 50 నుండి 100 గ్రామ్స్ కోవా పెడతారు.
మంచి కోవా 10 g 4/- అంటే average గా వేసుకున్న ఒక బన్ లో 30/- పడితే.. బన్ cost తో కలిపి 35/- అమ్మాలి. బల్క్ గా అమ్మినా 20కి అమ్మాలి.

మరి 10/-కి ఇస్తుంటే జనం ఆలోచించకుండా అది కల్తీ నా.. నిజమా అని తెలుసుకోలేకపోతున్నారు.

చీప్ గా వస్తున్నాయి అని కొని తినడం ఎందుకు?
మళ్ళా కల్తీ అని సోషల్ మీడియాలో ఊదర గొట్టడం ఎందుకు?

ఆరోగ్యం మనది అయినప్పుడు.. జాగ్రత్త కూడా మనదే అవ్వాలి. అయ్యో చిరు వ్యాపారి అని సానుభూతి చూపితే పోయేది మీ ఆరోగ్యం.. ఏదైనా సరే..
మన ఆరోగ్యం… మన చేతుల్లోనే…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button