KhammamPoliticalTelangana

కోర్టు ఆదేశానుసారమే… భూదాన భూముల్లో పేదల ఇళ్లు

కోర్టు ఆదేశానుసారమే… భూదాన భూముల్లో పేదల ఇళ్లు

కోర్టు ఆదేశానుసారమే… భూదాన భూముల్లో పేదల ఇళ్లు.

న్యాయస్థానం ఆదేశాలను గౌరవించాలి.

పోలీసుల జోక్యం మానుకోవాలి.

ఇళ్లస్థలాలకు వెంటనే నీటి, విద్యుత్ వసతి కల్పించాలి.

జస్టిస్ బి.చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

ఖమ్మం : కోర్టు ఆదేశానుసారం భూదాన భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని,వారికి వెంటనే మంచినీటి వసతి,కరెంట్ సౌకర్యం తక్షణమే కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి బి.చంద్రకుమార్,సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గార్లు డిమాండ్ చేశారు.

ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2014లో వెలుగుమట్ల రెవిన్యూ మౌజాలోని భూదాన భూమిని పేదల ఇళ్లస్థలాల కోసం కేటాయించబడిందని,కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఇళ్ల స్థలాల పేదలకు కనీస వసతులు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం,వారిని అక్కడ నుండి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరించే కార్యక్రమాలు చేయడం తగదని అన్నారు.

భూదాన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లు ఆరోపించారు.అట్టి భూమి నుండి పేదలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్లగొడితే ఆ భూమిని కబ్జా చేసే అవకాశం ఉంటుందని అనుకోవడం మీ అమాయకత్వమన్నారు.

జిల్లా అధికారులు కోర్టు ఆదేశాలను అనుసరించి వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లస్థలాలు ఏర్పాటు చేసుకున్న వారికి తక్షణమే సౌకర్యాలు కల్పించాలని కోరారు.

రాజకీయ నాయకులు,ఉన్నతాధికారులు ఒత్తిడి మేరకు పోలీసులు పేదలను బెదిరించి వెళ్ల గొట్టాలని చూస్తే వారిపై న్యాయపరమైన చర్యలు తప్పవని, దానికి వారే బాధ్యులవుతారని హెచ్చరించారు.

విజ్ఞతతో రాజ్యాంగం ప్రకారం కోర్టు అదేశాలను అనుసరించి కాలనీ పేదలకు న్యాయం చేయాలని,కనీస సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.

భూదాన భూములను అమ్మే హక్కు,కొనే హక్కు ఎవరికీ లేవని స్పష్టం చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు,బడా రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు వెలుగుమట్ల భూములను ఆక్రమిస్తే న్యాయస్థానం ముందు నిలబడక తప్పదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో భారత-చైనా మిత్రమండలి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మోహన్ రెడ్డి,స్వతంత్ర కార్మిక సంఘాల సమాఖ్య (FITU) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి,”గ్రామీణ పేదల సంఘం”తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వెంకటాద్రి,
సీనియర్ న్యాయవాది వి.లక్ష్మీనారాయణ,తెలంగాణ ఓ.పి.డి.ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.విజయేందర్,”గ్రామీణ పేదల సంఘం”తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పడిగ ఎర్రయ్య,”భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం
(మార్క్సిస్టు-లెనినిస్టు)UCCRI (M-L)నాయకులు పోలెబోయిన ముత్తయ్య, భారత-చైనా మిత్ర మండలి ఆంధ్ర ప్రదేశ్ జనరల్ సెక్రెటరీ సుబ్బారెడ్డి,గ్రామీణ పేదల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.లింగయ్య, UCCRI (ML)నల్లగొండ జిల్లా నాయకులు సురేందర్,”ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ”ఖమ్మం జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు రవీంద్ర స్వామి(న్యాయవాది), బాణాల లక్ష్మణాచారి,లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు భద్రు నాయక్,బిసి,ఎస్‌సి, ఎస్‌టి జెఏసి నాయకులు రాంబాబు,జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ చిర్రా రవి, చైతన్య రైతు సంఘం నరసింహ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button