
ఘనంగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు
కేక్ కట్ చేసిన మద్దినేని స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్ రెడ్డి, తుమ్మల యుగేందర్ తదితరులు
వందమంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాల పంపిణీ
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి జన్మదినోత్సవ వేడుకలను గురువారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగేందర్, ఎదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పీ. అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ తదితరులు కట్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాటల్లో నిబద్ధత, చేతల్లో పారదర్శకత కలిగిన గొప్ప నాయకుడు రఘురాం రెడ్డి గారని అన్నారు.
ఎంపీ పదవిని ఒక బాధ్యతగా భావించి తన సమర్ధ నాయకత్వంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారని తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అడ్డాలకు చెందిన 100 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో..: మార్కెట్ చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు, మాజీ మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, మాజీ డిసిసి అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు దీపక్ చౌదరి, ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఇమామ్ భాయ్, రంజిత్ నాయక్, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, ఓబిసి సెల్ వైస్ చైర్ పర్సన్ హారికా నాయుడు, నాయకులు లింగాల రవికుమార్, వడ్డేబోయిన నరసింహారావు, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీకళా రెడ్డి, మొగిలిచర్ల సైదులు, చింతమల్ల గురుమూర్తి, కరాటే వేణు, విప్లవ్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, సర్పంచ్ లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




