
ఓ కార్పొరేట్ కాలేజీలో దా*రుణం, డ్రగ్స్ మత్తులో తన్నుకున్న విద్యార్థులు!!
ఖమ్మం : క్రమశిక్షణకు మారు పేరుగా నిలవాల్సిన ప్రయివేట్ కార్పొరేట్ కాలేజీలు నేడు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి,అక్కడ చదువుతున్న విద్యార్థులు గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్ధాలకు అలవాటుపడి తోటి విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు,
తల్లి దండ్రుల పెంపకం లోపమో లేక విద్యార్థులపట్ల అధ్యాపాకుల నిర్లక్షవైఖరో తెలియదు కానీ విద్యార్థుల్లో రోజు రోజుకి క్రూర స్వభావం పెచ్చుమీరుతుంది,లక్షల్లో ఫీజులు కట్టి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనుకుంటే కార్పొరేట్ కాలేజీలు మాత్రం ర్యాంకుల వేటలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారు,
బహుశా ఈ ఒత్తిడి తట్టుకోలేక,తల్లిదండ్రులకు చెప్పుకోలేకనేమో మాధకద్రవ్యాలకు అలవాటుపడి విచక్షణ కోల్పోతున్నారు…..
తాజాగా ఖమ్మం నగరంలో కలెక్టరెట్ కు కూతవేటు దూరంలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది,మద్యం, డ్రగ్స్ మత్తులో తోటి విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,
రెండు రాష్ట్రాల్లో “చైనా” దేశం పేరుతో విద్యా వ్యాపారం చెస్తూ, టీవి ఛానెల్లలో, ప్రముఖ వార్త పత్రికల్లో కోట్ల రూపాయల వాణిజ్య ప్రకటనలు ఇస్తూ సొంత డబ్బాలు కొట్టుకునే ఓ కార్పొరేట్ కళాశాలలో జరిగే దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి,
గత మూడు రోజుల క్రితం డ్రగ్స్ తీసుకున్న కొందరు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విచక్షణ కోల్పోయి మామిడాల విశాల్ అనే విద్యార్థిపై దాడి చేసి గాయపరిచారు,
కండ్ల ముందు జరుగుతున్న దారుణాన్ని అడ్డుకోబోయిన విద్యార్థులపై కూడా దాడి చేశారు,దీంతో దాడిలో గాయపడిన విద్యార్థి గత మూడు రోజులుగా ఓ ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది,
ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే దాడీ జరుగుతున్న సమయంలో కలశాల హాస్టల్ కు సంబందించిన వార్డెన్,సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది….
జరిగిన దాడిని రహస్యంగా వీడియో తీసిన మరో విద్యార్థి
తన తల్లిదండ్రులకు పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది,
మరుసటి రోజు ఘటన గురించి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో ఇలాంటివి కాలేజీలో సాధారణంగా జరుగుతూనే ఉంటాయాని నారాయణ కళాశాల యాజమాన్యం విషయాన్నీ లైట్ తీసుకుని కొట్టిపడేసిందని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు,
అంతే కాకుండా కొట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి ఏదైనా ఉంటే మీరు మీరు బయట చూసుకోండి, మా కళాశాలకు పూయకండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంతోపాటు,దెబ్బలు తిన్న విద్యార్థి తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఈ విషయం బయటకు పొక్కితే ఈ నెల 26 న జరగబోయే చివరి పరీక్షలకు హాల్ టికెట్ ఇవ్వమని కళాశాల యాజమాన్యం బెదిరింపులకు దిగినట్లు విద్యార్థి తల్లిదండ్రులు చెపుతున్నట్లు తెలుస్తుంది,
విషయం అనోటా,ఈ నోటపడి బయటకు పొక్కడంతో సమాచారం తెలుసుకుని వివరాలకోసం కళాశాలకు వెళ్లిన ఓ మీడియా చానల్ ప్రతినిధితో మేము మీ ఛానెల్ యాజమాన్యానికి సంవత్సరానికి కోట్ల రూపయాల యాడ్స్ ఇస్తున్నాం,
మీతో పాటు అన్నీ న్యూస్ ఛానెల్స్ కు, న్యూస్ పేపర్లకు కోట్లల్లో యాడ్స్ ఇస్తున్నాం,ఇంత చిన్న విషయానికి కూడా వస్తారా,మీ యజమాన్యానికి చెప్పి మీ ఉద్యోగం పీకించామంటావా అంటూ బెదిరింపులకు దిగడంతో దిక్కుతోచని రిపోర్టర్ భయబ్రాంతులకు గురయ్యాడు,
ఇదే విషయం మీద మరో ఛానెల్ రిపోర్టర్ ప్రశ్నించగా అసలు మీ దగ్గర ఏ ఆధారం ఉందని హడావిడి చేస్తున్నారని కళాశాల యాజమాన్యం ఎదురు దాడి చేసింది, తన దగ్గర ఉన్న వీడియోలు చూపించడంతో నోరేళ్లబెట్టడం యాజమాన్యం వంతయింది,
ఇప్పటికైనా కాలేజీలో జరిగిన అమానుష సంఘటనను,జిల్లా కలెక్టర్ స్పందించి, సమగ్ర పోలీసు విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు…




