
ఎంపీ ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను శనివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో, ఆయన్ను పరామర్శించేందుకు ఈటల రాజేందర్ కామారెడ్డికి బయల్దేరారు. అయితే, ఆయన వెళ్తే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగాఆయన్ను మేడ్చల్‌లోని తన నివాసంలోనే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.
మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఈటల నివాసానికి చేరుకుని ఆయన్ను బయటకు రాకుండా నిలిపివేశారు. ఈ హౌస్ అరెస్ట్‌ను ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాయిజం చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.




