PoliticalTelangana

ఏసీబీకి చిక్కిన డాక్యుమెంట్ రైటర్, సబ్ రిజిస్ట్రార్

ఏసీబీకి చిక్కిన డాక్యుమెంట్ రైటర్, సబ్ రిజిస్ట్రార్

ఏసీబీకి చిక్కిన డాక్యుమెంట్ రైటర్, సబ్ రిజిస్ట్రార్

Web desc : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టుబడిన అధికారులను ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారించినట్లు తెలిపారు.

ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడితే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్ ఏసీబీ ఇంచార్జ్ గా ఉన్న డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

ఓ బాధితుడి వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్ తో పాటు మంథని సబ్ రిజిస్ట్రార్ పట్టుకున్నారు.

మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నురి బాపుకు సంబంధించిన 300 చదరపు గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు.

బాధితుడి 16500 రూపాయలను లంచం ఇస్తుండగా డాక్యుమెంట్ రైటర్ రషీద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్ లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏ1 గా సబ్ రిజిస్టర్, ఏ2 గా రషీద్ ను కరీంనగర్ లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

అప్పుడు సర్వేయర్.. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ . గత సంవత్సరం ఫిబ్రవరి 21న మంథని రెవెన్యూ కార్యాలయంలో పని చేసిన సర్వేయర్ భూమి సర్వే కొరకు ఓ రైతు వద్ద 3 వేలు లంచం తీసుకుంటుండగా మంథని బస్టాండ్ లో లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.

మరోసారి శుక్రవారం మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులు ఉలిక్కి పడ్డారు. అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టినట్లు అయ్యింది.

ఏసీబీ ఎంటర్.. డాక్యుమెంట్ రైటర్లు పరార్ మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై ముందు నుంచి స్థానికంగా పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక్కడ అంతా డాక్యుమెంట్ రైటర్లు చెప్పింది ఇవ్వాల్సిందేనన్న రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే వారి నుంచి ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు వచ్చినట్లు సమాచారం అందడంతో కొందరు డాక్యుమెంట్ రైటర్లు షేటర్ కు తాళం వేసి పరారయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button