
క్షణికావేశంలో వివాహిత ఆత్మ*హత్య
Web desc : షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో క్షణికావేశంతో వివాహిత ఆత్మ*హత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. తాళ్లపల్లి గ్రామానికి చెందిన నరసింహులు(35), ఆశిగారి నందిని(27)కి 10 సంవత్సరాల క్రితం వివాహమైంది.
ఈ దంపతులకు 6 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. దినసరి వృత్తి నేపథ్యంలో శనివారం సాయంత్రం మార్కెట్కు వెళ్లిన భర్తకు వచ్చే సరికి భార్య కనిపించడం లేదని ఫోన్ చేసినట్లు స్థానికులు తెలిపారు.
భర్త నరసింహులు భార్య నందినికి ఫోన్ చేసి బాబు ఒక్కడిని ఇంట్లో పెట్టి ఎక్కడికి వెళ్ళావు అని కొద్దిగా మందలించినట్లు ప్రాథమికంగా తెలిసింది.
భర్త మందలింపుకు కొద్దిగా మానసికంగా కుంగిపోయిన నందిని క్షణికావేశంలో తోటి కోడలికి ఫోన్ చేసి బాబును మంచిగా చూసుకో అని చివరిగా మాట్లాడినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యులు గ్రామస్తులు కనిపించకుండా పోయిన నందినిని వెతకగా చివరగా తాళ్లపల్లి గ్రామంలోని ఉన్న చెరువులో తెల్లవారుజామున శవమై కనిపించిన నందినిని గుర్తించినట్లు పేర్కొన్నారు.
వెంటనే షాబాద్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



