EducationHealthMedakPoliticalTelangana

రాగిజావలో పురుగులు.. ఆరుగురు స్టూడెంట్స్ కు అస్వస్థత

రాగిజావలో పురుగులు.. ఆరుగురు స్టూడెంట్స్ కు అస్వస్థత

రాగిజావలో పురుగులు.. ఆరుగురు స్టూడెంట్స్ కు అస్వస్థత

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్​ స్కూల్​లో శనివారం ఫుడ్ పాయిజన్ జరిగింది. రాగిజావ తాగిన ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

స్కూల్​లో సుమారు 140 మంది స్టూడెంట్స్​ హాజరయ్యారు. ఉదయం వండిన రాగిజావ తాగిన విజయ్, సిద్దు, అరవింద్, ప్రభాస్, విష్ణు, చరణ్ అనే విద్యార్థులు జావలో పురుగులు ఉన్నట్లు గమనించి వంట సిబ్బందికి తెలిపారు.

వెంటనే మిగిలిన జావను పారబోశారు. అనంతరం ఆరుగురికి వాంతులు కావడంతో హెచ్​ఎం వారిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.

ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. డీఈఓ విజయ స్కూల్​కు చేరుకుని విచారణ చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button