NationalNotification

యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల..

యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల..

యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల..

నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌ 2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 349 పోస్టులను భర్తీ చేయనుంది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌.. లలో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాలను యూపీఎప్సీ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌ 2026 ద్వారా భర్తీ చేయనుంది.

డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా మార్చి 12, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో పోస్టుల సంఖ్య: 24
సెంట్రల్‌ రిసర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)లో పోస్టుల సంఖ్య: 204
సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో పోస్టుల సంఖ్య: 92
ఇండో-టిబేటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)లో పోస్టుల సంఖ్య: 4
శసస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ)లో పోస్టుల సంఖ్య : 38.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్ట్‌ 1, 2026 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 12, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు. రాత పరీక్ష ఆగస్ట్‌ 19, 2026వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో (పెన్ను, పేపర్) విధానంలో నిర్వహిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button