HyderabadPoliticalTelangana

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..హోంగార్డుతో పాటు యువతి దుర్మరణం

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..హోంగార్డుతో పాటు యువతి దుర్మరణం

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..హోంగార్డుతో పాటు యువతి దుర్మరణం

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పరిధిలో వెంగళరావు పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ హుస్సేన్ (40), తన విధులు ముగిసిన తర్వాత పార్ట్ టైమ్ రాపిడో డ్రైవర్‌గా వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

విజయనగరానికి చెందిన అక్షిత (20) అనే యువతి రాపిడో బుక్ చేసుకోగా, ఆమెను తీసుకుని హుస్సేన్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు.

మృతుడు సయ్యద్ హుస్సేన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం పార్ట్ టైమ్ పని చేస్తూ ప్రమాదానికి గురై ఆయన మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button