
ఏసీబీ వలలో మాసబ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఏఈ..
Web desc : అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాసాబ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఏఈ మామిడి శెట్టి శ్రీనివాస్ 16 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం.. మాసాబ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ పరిధిలోని ఓ బాధితుడు కరెంటు మీటర్ ట్యాంపరింగ్‌కి పాల్పడ్డాడని కేసు నమోదు చేస్తానని బెదిరించి మీటర్‌ను ఏఈ తీసుకొని వచ్చాడు.
అంతేకాకుండా కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 17 వేలు లంచం ఇవ్వాలని బాధితుడిని ఏఈ డిమాండ్ చేశారు. కాగా బాధితుడు రూ.16 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు.




