Andhra PradeshPolitical

మోహన్ బాబు యూనివర్సిటీలో యువతి సూసైడ్

మోహన్ బాబు యూనివర్సిటీలో యువతి సూసైడ్

మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి సూసైడ్

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య అందరినీ కలచివేస్తోంది.

కలల ప్రయాణం కావాల్సిన మా అమ్మాయి జీవితం ఇలా కన్నీటి కథగా మారిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.ఎంబీయూలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన చదువులో ఎప్పుడూ ముందుండే విద్యార్థిని, క్లాస్ టాపర్.

ఇటీవల రాసిన పరీక్షల్లో 96 శాతం మార్కులు సాధించి కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది.అయితే, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో రూ.17 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కూడా సాధించింది.

అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆమె జీవితం ఆగిపోయింది. ఎవరు ఊహించని విధంగా గత రాత్రి యూనివర్సిటీ సమీపంలోని ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కుటుంబాన్ని, స్నేహితులను షాక్‌కు గురి చేసింది.

ఆశలు, ఆశయాలు నిండిన ఆ యువతి నిన్న చివరి సారిగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి “మన సమస్యలు తీరిపోతాయి” అని చెప్పింది. ఇక, ఆ మాటలే ఇప్పుడు భువన తల్లిదండ్రుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి.

రుయా మార్చురీ దగ్గర “మా అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు” అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. విద్యార్థిని మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ రుయా ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

అయితే హాస్టల్లో ఉరివేసుకోవడంతో.. వెంటనే ఆమెను నారావారిపల్లి ఆసుపత్రికి తరలింపు

అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన డాక్టర్లు

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button