HyderabadPoliticalTelangana

అక్రమార్కులకు అడ్డగా మారిన మున్సిపాలిటీ యంత్రాంగం

అక్రమార్కులకు అడ్డగా మారిన మున్సిపాలిటీ యంత్రాంగం

అక్రమార్కులకు అడ్డగా మారిన దమ్మాయిగూడ మున్సిపాలిటీ యంత్రాంగం

ప్రధాన రహదారి పక్కన భారీ అక్రమ షెడ్ నిర్మాణం పట్టించుకోని అధికారులు

కంప్లైంట్ పెట్టినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కమిషనర్

కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్

సి కె న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రంజిత్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన అనుమతులు లేని భారీ అక్రమ షెడ్డు నిర్మాణం పలు సందర్భాల్లో కంప్లైంట్ లు పెట్టినప్పటికీ చూసి చూడనట్టు చోద్యం చూస్తున్న మున్సిపల్ యంత్రాంగం అక్రమ షెడ్ల నిర్మాణంలో గత కొన్నేళ్లగా షెడ్ల నిర్మాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న పట్టించుకోవడం లేదంటే వీటి వెనకాల పెద్ద చేతులే అడ్డుకుంటున్నాయనే విషయం దమ్మాయిగూడ మున్సిపాలిటీ గురించి ప్రజలు టక్కున చెప్పేస్తారు

ఎవరేమీ చేయలేరని ధీమాతో అక్రమ కట్టడాలకు హద్దు అదుపు లేకుండా నిర్మించడం ద్వారా మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది అయినా తమకు రావలసిన వాటాలు వస్తున్నాయని విధంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది వ్యవహారం కంచే చేనును మేసిన విధంగా ఉందని ప్రజలు వాపోతున్నారు

ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణం ఈ అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి అక్రమ కట్టడాలు మళ్లీ పునరావృతం కాకుండా కలెక్టర్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button