
నల్గొండ జిల్లాలో ఐదుగురు నకిలీ డాక్టర్లు అరెస్టు
Web desc : నల్గొండ జిల్లాలో మరోసారి నకిలీ డాక్టర్లను అరెస్టు చేశారు పోలీసులు. మిర్యాలగూడలో అర్హత లేకుండా డాక్టర్లుగా కొనసాగుతున్న నకిలీ వైద్యులను బుధవారం (ఫిబ్రవరి 25) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఐదు కంటి ఆసుపత్రులలో ఐ స్పెషలిస్టులుగా చెలామణి అవుతున్న డాక్టర్లను పోలీసుల సాయంతో మెడికల్ కౌన్సిల్ అధికారులు పట్టుకున్నారు.ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలలోనకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది.
వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ, కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు.
అంతకు ముందు 2025 మే నెలలో కూడా నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులను పట్టుకున్న విషయం తెలిసిందే. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించి నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసింది.
గతంలో కాంపౌండర్లుగా పనిచేసి ఆర్‌ఎంపీ సర్టిఫికెట్ సంపాదించి డాక్టర్ల వేషధారణలో ప్రజలను మోసం చేస్తున్న వారిపై 14 కేసులు నమోదు చేసింది.
డాక్టర్ లాలయ్య కుమార్, డాక్టర్ మహేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ జి.శ్రీనివాస్ తెలిపారు




