HyderabadPoliticalTelangana

అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే.. విద్యా శాఖ అధికారులకు CM రేవంత్‌ ఆదేశాలు

అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే.. విద్యా శాఖ అధికారులకు CM రేవంత్‌ ఆదేశాలు

అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే.. విద్యా శాఖ అధికారులకు CM రేవంత్‌ ఆదేశాలు

తెలంగాణ సర్కార్‌కు విద్యా కమిషనర్ కీలక సూచనలు చేసింది. ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు రద్దుకు సూచనలు చేసింది.

పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంది.దాంతో పాటు ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని స్పష్టం చేసింది. రెండేళ్లలో మెరుగుపడకపోతే ఏకంగా సర్వీసు నుంచి తొలగించాలని సూచించింది.

ఇకపై నియమించే ఉపాధ్యాయులకూ కొత్త నిబంధనలు సూచించింది. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది. డీఈఐఈడీ కోర్సు రద్దు చేయాలని తెలిపింది.

మరోవైపు.. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజక వర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మంగళవారం సచివాలయంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం సమర్పించిన ‘తెలంగాణ విద్యా విధానం 2026: సమగ్ర విద్యా దృక్పథం’ నివేదికపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button