HyderabadPoliticalTelangana

సనత్‌నగర్ లో హోటల్ కుక్ దారుణ హ*త్య

సనత్‌నగర్ లో హోటల్ కుక్ దారుణ హ*త్య

సనత్‌నగర్లో హోటల్ కుక్ దారుణ హ*త్య

Web desc : నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో పొడిచి హోటల్‌లో పనిచేసే కుక్‌ను హత్య చేసిన ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే హత్య చేసింది ఎవరో ఇంకా స్పష్టత రాలేదు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక రాష్ట్రానికి చెందిన శంకర్ (55) భార్యా పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. భరత్‌నగర్ ప్రాంతంలో నివసిస్తూ, సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఫేమస్ టీ అండ్ ఉడిపి సెంటర్‌లో గత కొన్నేళ్లుగా హెడ్ కుక్‌గా పనిచేస్తున్నాడు.

బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన ఇంటి నుంచి హోటల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయిన శంకర్‌ను స్థానికులు 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే శంకర్ మరణించాడు. హత్య చేసింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, ఆ పరిసర మార్గాల్లోని కెమెరా దృశ్యాలను సేకరించి నిందితుడి జాడ కోసం జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతమని నిర్ధారించుకుని, అదే ప్రదేశాన్ని హత్యకు అనువుగా భావించి దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button