HyderabadPoliticalTelangana

కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!

కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!

కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఊహించని బిగ్ షాక్ తగిలింది.

ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(cbi) తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

కవితకు మళ్లీ చిక్కులు . ఇప్పటికే ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయట ఉన్న కవితకు, సీబీఐ తాజా అడుగు పెద్ద షాక్ అనే చెప్పాలి. వచ్చే వారం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీబీఐ అప్పీల్తో కవితకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

2021లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ, వారికి భారీగా లాభం చేకూరేలా నిబంధనలు మార్చారని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గి, ప్రైవేట్ వ్యక్తులకు అక్రమ లాభం కలిగిందనేది ప్రధాన కేసు.

ఈ విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసేందుకు కవిత ఆధ్వర్యంలోని ‘సౌత్ గ్రూప్’ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

ఇండో స్పిరిట్స్ అనే మద్యం కంపెనీలో కవితకు బినామీల ద్వారా వాటాలు ఉన్నాయని, ఆ కంపెనీ ద్వారా లాభాలను వెనక్కి పొందారని అభియోగాలు మోపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button