
కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక.. వ్యక్తి ఆత్మ*హత్య
కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపంతో వ్యక్తి ఆత్మ*హత్య చేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులో జరిగింది.
మృతుని భార్య మరియమ్మ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరుకల రత్నయ్య (45) శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని మంజీరా నది సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు.
ఏడాది క్రితం తన కూతురు రాణి వివాహం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక గత కొన్ని రోజులుగా దిగులుతో ఉన్న రత్నయ్య శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లి మంజీరా తీరంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు.
మృతుని భార్య మరియమ్మ ఫిర్యాదు మేరకు కొల్చారం ఏఎస్ఐ సుగుణాకర్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.



