PoliticalSanga reddyTelangana

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట NH 65పై బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి.

జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి.

ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి గాయపడ్డ వారిని అంబులెన్స్ లో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్ డోర్ పూర్తిగా ధ్వంసం కావడంతో డ్రైవర్ క్యాబిన్ నుంచి ప్రయాణికులను కిందకు దించారు.ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button