Bhadradri KottagudemEducationPoliticalTelangana

ఎగ్జామ్ రాస్తుండగా.. ఇంటర్ స్టూడెంట్ కు గర్భస్రావం

ఎగ్జామ్ రాస్తుండగా.. ఇంటర్ స్టూడెంట్ కు గర్భస్రావం

ఎగ్జామ్ రాస్తుండగా.. ఇంటర్ స్టూడెంట్ కు గర్భస్రావం

Social media viral : ఇంటర్ ఎగ్జామ్​ రాస్తుండగా ఓ స్టూడెంట్​కు గర్భస్రావమైన ఘటన కలకలం సృష్టించింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన ఇంటర్ ఒకేషనల్​ స్టూడెంట్​ పట్టణంలోని కేజీబీవీలో శుక్రవారం ఎగ్జామ్​కు అటెండ్​ అయింది. ఎగ్జామ్​ రాస్తూ ఇన్విజిలేటర్​ పర్మిషన్​ తీసుకొని వాష్​రూంకు వెళ్లింది.

ఆ స్టూడెంట్​ ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి, స్వీపర్​ను వాష్​రూమ్​ వద్దకు పంపించారు. తనకు పీరియడ్స్​ వచ్చాయని ఆ స్టూడెంట్​ చెప్పడంతో కాలేజీ నుంచి ఆమెకు అవసరమైన ప్యాడ్స్, న్యాప్​కిన్స్​ తెప్పించి ఇచ్చారు.

అనంతరం ఆ స్టూడెంట్​ ఎగ్జామ్​ రాసేందుకు రూంలోకి వెళ్లగా, అదే టైంలో వాష్​రూం క్లీన్​ చేస్తుండగా పిండం కనిపించడంతో స్వీపర్​ ఆందోళనకు గురయ్యారు.

గర్భస్రావం జరిగినట్లుగా గుర్తించి, విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఎగ్జామ్​ అనంతరం ఆ స్టూడెంట్​ను ట్రీట్​మెంట్​ కోసం గవర్నమెంట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం కొత్తగూడెం గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు.

ప్రెగ్నెంట్​ అయిన స్టూడెంట్​ మాత్రలు వేసుకోవడంతో నెలలు నిండక ముందే గర్భస్రావం జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button