
IAS అరవింద్ కుమార్ సస్పెండ్…
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్ ను సీఎం రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రం కూడా పర్మిషన్ ఇచ్చింది.
ఈ కేసుకు సంబంధించి అరవింద్ పై అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం లాంటి ఆరోపణల రావండతో ప్రభుత్వం ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆయనపై విచారణ పూర్తయ్యేవరకు ఈ సస్పెండ్ కొనసాగుతుంది.
మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా ప్రాసిక్యూషన్ కు కొంతకాలం క్రితమే గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు.
అలాగే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. ఇప్పటికే బీఎల్ఎన్ రెడ్డి పదవీ విరమణ చేశారు.



