KhammamPoliticalTelangana

ఏన్కూర్‌లో ఇద్దరు సేవా విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానాలు

ఏన్కూర్‌లో ఇద్దరు సేవా విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానాలు

ఏన్కూర్‌లో ఇద్దరు సేవా విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానాలు

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 01 2026: ఏన్కూర్ మండలంలో శనివారం నాడు ఇద్దరు సేవా విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. తమ తమ రంగాల్లో సుదీర్ఘకాలంగా సేవలందించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ బజారు మరియు హరిజనవాడ పాఠశాలలో పనిచేస్తున్న ఎం. నాగేశ్వరరావుకు సహచరులు, సంఘ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు.మొదటగా ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్ పాల్గొని బజారు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రామారావు, అనూష, ట్రేడర్స్ చీరాల నరసింహారావు, బానోత్ నరసింహారావు, ఏరువా నవీన్, పదిమల మురళీమోహన్, భూమా మధుసూదన్ రావు, కరిఆవుల నరసింహారావు, వేముల రామారావు, స్వర్ణ హరీష్ పాల్గొన్నారు. హమాలీ మెస్ట్రీలు కోటయ్య, కోటాచారి, పాపారావు, హమాలీ వర్కర్లు, ట్రేడర్స్ గుమస్థాలు కూడా హాజరై బజారు ని శాలువా కప్పి సన్మానించి సీట్లు పంచిపెట్టి అభినందనలు తెలిపారు.
అనంతరం ఏన్కూర్ హరిజనవాడ పాఠశాలలో పనిచేస్తున్న ఎం. నాగేశ్వరరావు పదవి విరమణ సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏన్కూర్ పి.ఆర్.టి.యు మండల శాఖ ఆధ్వర్యంలో నాగేశ్వరరావు ని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు మాజీ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు కూరాకుల సైదయ్య,భానోత్ గోపి,బత్తుల వెంకటేశ్వర్లు,సురేష్,కిరణ్, సీనియర్ నాయకులు మోతిలాల్, శ్యామల మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ సేవా విరమణ పొందిన ఇద్దరు అధికారులు తమ తమ విధుల్లో నిబద్ధతతో పనిచేసి సంస్థలకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమాలు స్నేహపూర్వక వాతావరణంలో ముగిశాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button