
కళాశాల భవనం పైనుంచి దూకి రికార్డు అసిస్టెంట్ ఆత్మ*హత్య
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అహ్మద్ (52) శనివారం కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కోటగిరి మండలం దోమలెడిగి గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ నాలుగేళ్లుగా కళాశాలలో పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ కల్లు తాగే అలవాటు ఉన్న ఆయన గత పది రోజులుగా మానేసి రంజాన్ ఉపవాసదీక్షలో ఉంటున్నారు.
ఈ క్రమంలో అహ్మద్ రెండు రోజులుగా మతిస్థిమితం కోల్పోయాడు. శనివారం తాను విధులకు రావడం లేదని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్లు చెప్పిన అహ్మద్ ఎప్పటిలాగే విధులకు హాజరయ్యాడని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గులాం ముస్తఫా తెలిపారు.
పొంతన లేకుండా మాట్లాడుతుండటంతో ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పి తాము విధి నిర్వహణలో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నస్రుల్లాబాద్ ఎస్సై రాఘవేందర్ తెలిపారు.



