JagityalaPoliticalTelangana

కొడుకులు పట్టించుకోవడం లేదు.. ప్రజావాణిలో వృద్ధుడి ఆవేదన

కొడుకులు పట్టించుకోవడం లేదు.. ప్రజావాణిలో వృద్ధుడి ఆవేదన

కొడుకులు పట్టించుకోవడం లేదు.. ప్రజావాణిలో వృద్ధుడి ఆవేదన

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల రాజయ్య తనకున్న ఇల్లు, 20 గుంటల స్థలాన్ని ఇద్దరు కుమారులైన శ్రీనివాస్, అంజయ్యకు చెరి సమానంగా వాటా పంచి ఇచ్చాడు. అయితే 2020లో రాజయ్య భార్య మరణించింది.

”ఆమె మరణించిన తర్వాత 6 నెలలు తన పెద్ద కుమారుడు చూసుకొని తరువాత నావల్ల కాదని ఇంటి నుంచి గెంటేశారు. చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళగా చిన్న కోడలు నానా బూతులు తిడుతుందనీ” బాధితుడు వాపోయాడు.

ఎవరూ పట్టించుకోకపోవడంతో కిరాయి ఇంట్లో ఉంటున్నానని నాకు వచ్చే రూ.2000 వృద్ధప్య పెన్షన్‌తో ఇంటి కిరాయి మందులకు సరిపోవడం లేదని ఇందుకు తోడు దీర్ఘకాలిక దగ్గు, దమ్ము అస్తమా జబ్బులు ఉండటంతో మందులకు సరిపోక నానా అవస్థలు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు బాధిత వృద్ధుడు ఫిర్యాదు చేశాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button