
పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మ*హత్య..
Web desc : జగిత్యాల : పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మ*హత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పీఎస్ పరిధిలోని పోచమ్మవాడకు చెందిన మూలస్థం ప్రణవి (25) బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటోంది. ఆమె విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపగా, తండ్రి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, పెళ్లి చేస్తానని చెప్పారు.
అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపానికి గురైన ప్రణవి, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
తండ్రి మూలస్థం గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.



